నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు - Indices opening low amid mixed global trends
close

Published : 11/02/2021 09:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

ముంబయి: వరుసగా మూడో రోజు దేశీయ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, దిగ్గజ రంగాల షేర్లలో లాభాల స్వీకరణతో గురువారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు నష్టాలతో మొదలుపెట్టాయి. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 120.64 పాయింట్లు దిగజారి 51,430.03 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 15,147 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఆటోమొబైల్‌, ఔషధ రంగాల షేర్లలో అమ్మకాలు జరుగుతుండగా.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసికల ఫలితాలు, వృద్ధి, ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. 

ఇదీ చదవండి..

మండుతున్న పెట్రోల్‌ ధరలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని