భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు - Sensex gains 450 pts
close

Updated : 26/03/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.41 సమయంలో సెన్సెక్స్‌ 467 పాయింట్లు ఎగబాకి 48,908 వద్ద, నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 14,477 వద్ద కొనసాగుతున్నాయి. వాబ్కో ఇండియా, లక్స్‌ ఇండస్ట్రీస్‌, సోమ్నిహోమ్‌, ఎన్‌సీసీ, కేపీఐటీ టెక్నాలజీస్‌ లాభాల్లో ఉండగా.. మెజెస్కో ఎల్‌, జయప్రకాశ్‌ అసోసియేట్స్‌, ఎడల్వైజ్‌ ఫిన్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటా కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అన్ని రంగాలకు చెందిన సూచీలు నేడు లాభాల్లోనే ట్రేడవుతుండటం విశేషం. నేడు కల్యాణ్‌ జ్యూవెలర్స్‌, సురోడే స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌ షేర్లు నేడు మార్కెట్లో లిస్టింగ్‌ కానున్నాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ధర రూ.159 తగ్గగా.. వెండి కిలోకు రూ.345 కుంగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.21పైసలు తగ్గి 72.78గా ఉంది.

ఇవీ చదవండి

ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ అదరహో

క్రిప్టోకరెన్సీలపై ఆందోళనలున్నాయ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని