ఐపీవోకు శ్యామ్‌ మెటాలిక్స్‌..! - Shyam Metalics and Energy refiles for Rs 1107 crore IPO
close

Published : 01/03/2021 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీవోకు శ్యామ్‌ మెటాలిక్స్‌..!

న్యూదిల్లీ: దేశీయంగా అతిపెద్ద ఫెర్రో అలాయ్‌ తయారీ సంస్థ శ్యామ్‌ మెటాలిక్స్‌ ఐపీవోకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొంటోంది. తాజాగా మరోసారి ఐపీవోకు సంబంధించిన పత్రాలను పూర్తి చేసింది. ఈ ఇష్యూ విలువ రూ.1,107 కోట్లు ఉండొచ్చని అంచనా. కోల్‌కతాకు చెందిన ఈ కంపెనీ క్యాపిటల్‌ మార్కెట్లోకి వచ్చేందుకు 2018,2019ల్లో ప్రయత్నించింది. కానీ చివరి నిమషంలో తన ప్రయత్నాలను విరమించుకొంది. తాజాగా వస్తున్న ఈ  ఇష్యూలో ప్రస్తుత షేర్‌ హోల్డర్స్‌కు చెందిన రూ.657 కోట్లు విలువైన వాటాలను కూడా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ప్రమోటర్‌, ప్రమోటర్‌ గ్రూప్‌నకు చెందిన శుభం క్యాపిటల్‌, శుభం బిల్డ్‌వెల్‌,కల్పతరూ హౌస్‌ఫిన్‌,డొరిటే ట్రాకోన్‌,టాప్‌లైట్‌ మెర్సింటైల్స్‌ వంటి సంస్థలు మొత్తం రూ.450 కోట్ల విలువైన వాటాలను విక్రయించనున్నారు. వీటిలో అర్హులైన ఉద్యోగులకు 3లక్షల వాటాలను కేటాయించాలని నిర్ణయించారు.

ఈ ఆఫర్‌ మొత్తంలో 50శాతం వాటాలను క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు కేటాయించనున్నారు.  ఇక నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు 15శాతం, రిటైల్‌ కొనుగోలు దారుల కోసం 30శాతం వాటాలను సిద్ధం చేశారు.  ఈ సంస్థకు 13 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి 42 పంపిణీ దారులతో నెట్‌వర్క్‌ ఉంది. కంపెనీ ప్రస్తుతం ఒడిశాలోని సంబల్పూర్‌లోని ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. 

ఇవీ చదవండి

భారత్‌ ‘పవర్’‌పై డ్రాగన్‌ గురి!

బుల్‌కు జీడీపీ కిక్కు..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని