Stock market: నష్టాల నుంచి లాభాల్లోకి - Stock market Indices Ends in green
close

Published : 14/07/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: నష్టాల నుంచి లాభాల్లోకి

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల్లోకి ఎగబాకాయి. ఐటీ, సాంకేతిక, లోహ, పారిశ్రామిక రంగాల నుంచి సూచీలకు మద్దతు లభించింది. దీంతో చివరకు సెన్సెన్స్‌ 132 పాయింట్ల లాభంతో 52,904 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 15,853 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.59 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో ముగియగా.. మారుతీ, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని