శేంద్ర గ్రీన్‌ ఎనర్జీలో వాటా విక్రయానికి ప్రతిపాదన
close

Published : 01/08/2021 03:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శేంద్ర గ్రీన్‌ ఎనర్జీలో వాటా విక్రయానికి ప్రతిపాదన

ముంబయి: శేంద్ర గ్రీన్‌ ఎనర్జీలో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కంపెనీ(ఐఈడీసీఎల్‌)కున్న వాటాను విక్రయించడానికి ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ప్రతిపాదనలకు(ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానం పలికింది. ఐఈడీసీఎల్‌కు 100 శాతం అనుబంధ సంస్థే శేంద్ర గ్రీన్‌ ఎనర్జీ(ఎస్‌జీఈఎల్‌). కాగా, అంతక్రితం ఎస్‌జీఈఎల్‌ను జీఏపీఎస్‌ పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా పిలిచే వారు. మహారాష్ట్రలోని శేంద్ర ఎమ్‌ఐడీసీ వద్ద ఉన్న జీఏపీఎస్‌లో 100 శాతం వాటాను జీఎమ్‌ఎస్‌ గ్రూప్‌ నుంచి డిసెంబరు 2010లో ఐఈడీసీఎల్‌ కొనుగోలు చేయడంతో పేరు మారింది. కాగా, అర్హత గల దరఖాస్తుదారులు ఆగస్టు 30, 2021 కల్లా ఆర్‌ఎఫ్‌పీలను సమర్పించాలని ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కోరింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని