కొత్త ట్రెండ్‌.. ‘ఫ్లెక్సి కేంపస్‌’
close

Published : 27/10/2021 02:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త ట్రెండ్‌.. ‘ఫ్లెక్సి కేంపస్‌’

 వివిధ రకాల ఉద్యోగాలకు ఒకే ప్రాంగణం

‘అరబిందో గెలాక్సీ’ని తీసుకున్న ‘స్మార్ట్‌వర్క్స్‌’

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ నగరాల్లో ‘ఫ్లెక్సిబుల్‌’ పని ప్రాంగణాలను నిర్వహించే సంస్థ స్మార్ట్‌వర్క్స్‌ హైదరాబాద్‌లో ఒక పెద్ద కార్యాలయ ప్రాంగణాన్ని తన ఖాతాలో వేసుకుంది. హైటెక్‌ సిటీ సమీపంలో ‘అరబిందో గెలాక్సీ’ అనే ఆఫీసు భవనాన్ని స్మార్ట్‌వర్క్స్‌ తీసుకున్నట్లు, ఈ ఏడాదిలో హైదరాబాద్‌లో ఇటువంటి అతిపెద్ద లావాదేవీ ఇదేనని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సేవల సంస్థ అయిన  సీబీఆర్‌ఇ సౌత్‌ ఏషియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. ఈ భవనంలో 2.32 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం ఉంది. సాఫ్ట్‌వేర్‌ సేవలు, పరిశోధన-అభివృద్ధి వంటి భిన్న రకాల విధులకు తగినట్లు ఉండే కార్యాలయ స్థలమే ఫ్లెక్సి కేంపస్‌.

  హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల నుంచి ‘ఫ్లెక్సిబుల్‌’ పని ప్రదేశాలకు అధిక గిరాకీ ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘స్మార్ట్‌వర్క్స్‌’ ఈ ప్రాంగణాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ‘ఫ్లెక్సిబుల్‌’ ప్రాంగణాల్లో 3.90 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఉంది. ఇందులో హైదరాబాద్‌లోనే 60 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం ఉండటం గమనార్హం. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో అదనంగా మరో 15 శాతం ‘ఫ్లెక్సి కేంపస్‌’ స్థలం అందుబాటులోకి వస్తుందని సీబీఆర్‌ఇ  సౌత్‌ ఏషియా పేర్కొంది. ప్రధానంగా ఐటీ కంపెనీల నుంచి దీనికి డిమాండ్‌ వస్తోందని వివరించింది. గత ఏడాది కాలంలో హైదరాబాద్‌ స్థిరాస్తిరంగం అన్ని సవాళ్లను తట్టుకుని నిలవడమే కాకుండా, శరవేగంగా ఎదుగుతున్నట్లు సీబీఆర్‌ఇ ఇండియా ఛైర్మన్‌ - సీఈఓ అంషుమన్‌ మ్యాగజైన్‌ పేర్కొన్నారు. స్మార్ట్‌వర్క్స్‌  దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ‘ఫ్లెక్సిబుల్‌’ పని ప్రాంగణాలు నిర్వహిస్తోంది. దాదాపు 400 కంపెనీలు ఈ సంస్థ సేవలు తీసుకుంటున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని