Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నా పేరు హరి కృష్ణ. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నెలసరి జీతం రూ. 90 వేలు. ఇందులో ఏడాదికి  రూ. 50 వేలు పీఎఫ్ కోసం చెల్లిస్తున్నాను. మంచి పన్ను ఆదా మార్గాలు, భవిష్యత్తు కోసం పెట్టుబడులు సూచించండి.

Asked by Harikrishna on
ఎన్పీఎస్ లో పెట్టుబడులు చేయడం వల్ల ఏడాదికి సెక్షన్ 80సి ద్వారా రూ. 1.50 లక్షలతో పాటు అదనంగా మరో రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఎన్పీఎస్ లో పన్ను మినహాయింపు తో పాటు మంచి పదవీ విరమణ నిధి కూడా పొందొచ్చు.  కనీసం 10 ఏళ్ళు పెట్టుబడి పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఇందులో కొంత రిస్క్ ఉంటుంది, మంచి రాబడి పొందే అవకాశం కూడా ఉంది. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. 

మరిన్ని

మీ ప్రశ్న