నేను పదేళ్లకే ఓ పిల్లకి ప్రేమలేఖ రాశా.. - INDIVIDUALITY from Puri Musings
close
Updated : 28/09/2020 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను పదేళ్లకే ఓ పిల్లకి ప్రేమలేఖ రాశా..

హైదరాబాద్‌: పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని, వారికంటూ ఓ వ్యక్తిత్వం ఏర్పడాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పేర్కొన్నారు. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో ‘ఇండివిడ్యువాలిటీ’ అనే అంశం గురించి ముచ్చటించారు. తల్లిదండ్రులు వారి కోరికల్ని పిల్లలపై రుద్దకూడదని వివరించారు.

‘మనందరం పిల్లలకు జన్మనిస్తాం. ప్రేమతో పెంచుతాం. వాళ్ల ఆరోగ్యం పాడైపోతుందేమో అని బురదలో ఆడనివ్వం, వర్షంలో తడవనివ్వం. కాళ్లకు చెప్పులు లేకపోతే ఒప్పుకోం, బిస్లరీ వాటర్‌ తప్ప మరొకటి తాగొద్దని చెబుతాం. ఇలా ప్రకృతికి వాళ్లను దూరం చేయడం వల్లే.. వాళ్లకి రోగనిరోధకశక్తి లేకుండా పోయింది. దీనికి తోడు మన ఇష్టాలన్నీ వాళ్లపై రుద్దుతాం. మనకు నచ్చిన డిగ్రీలే వాళ్లు చదవాలి, మనం చెప్పిన వాళ్లనే పెళ్లి చేసుకోవాలి.. పాపం.. వాళ్లకేంటి ఈ నరకం. వాళ్ల అభిప్రాయాలు కూడా తెలుసుకోండి.. స్వేచ్ఛ ఇవ్వండి’.

‘పిల్లలకు తప్పకుండా రెండు ఇవ్వాలి.. ఒకటి అవగాహన, రెండు వ్యక్తిత్వం. అవగాహన ఏర్పరిస్తే.. మంచీచెడు తెలుస్తాయి. వ్యక్తిత్వం వల్ల స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఏదైనా చెబితే దానికి ‘నో’ అని చెప్పగలిగే స్వేచ్ఛ వాళ్లకి ఇవ్వాలి. వాళ్ల నిర్ణయాల్ని వాళ్లు తీసుకోనివ్వండి. మనం పడ్డ కష్టాలు మన పిల్లలకి ఎందుకు? అనుకోవద్దు. వాళ్లు కూడా కష్టాలు పడాలి, తెలుసుకోవాలి. అందుకే నా కథల్లో హీరోలు దృఢంగా కనిపిస్తారు’.
 
‘ఏంటమ్మా? ఏంటి బంగారం? అని మాట్లాడకండి. చిన్నప్పుడు ఓకే కానీ.. ఇద్దరు పిల్లలు పుట్టిన కూతురితో కూడా తల్లిదండ్రులు ఇలానే మాట్లాడం చూశా. ముందు అలా మాట్లాడటం మానేయండి. అప్పుడు వాళ్లు నిజాలు చెబుతారు. లేకపోతే ఓ డ్రామా కంపెనీలా తయారౌతుంది. పదేళ్లు దాటితే చిన్నారులు కాదు. నేను పదేళ్లకే ఓ పిల్లకి ప్రేమలేఖ రాశా.. ఇంకా చిన్నపిల్లలేంటి. మన తర్వాతి తరం ఇంకా అడ్వాన్స్‌గా ఉంది. కాబట్టి పిల్లల్ని పెంచే విధానం మార్చుకోండి, వాళ్లకి ఓ వ్యక్తిత్వం  ఏర్పడనివ్వండి’ అని పూరీ ముగించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని