సౌత్‌ డైరెక్టర్‌పై బీటౌన్‌ భామ విమర్శలు - actress surveen chawla on casting couch
close
Updated : 25/06/2021 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సౌత్‌ డైరెక్టర్‌పై బీటౌన్‌ భామ విమర్శలు

అగ్ర దర్శకుడై ఉండి నన్ను ఇబ్బందిపెట్టాడు

ముంబయి: దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ అగ్ర దర్శకుడి వల్ల తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నానని బాలీవుడ్‌ నటి సుర్వీన్‌ చావ్లా ఆరోపించారు. ఓ సినిమా ఆఫర్‌ విషయమై  ఆ దర్శకుడు తనతో ఇబ్బందికరంగా మాట్లాడాడని ఆమె అన్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నటి నీనా గుప్తా.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో చాలాకాలం తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే సుర్వీన్‌ చావ్లాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

‘‘ఏ పరిశ్రమలోనైనా క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఉంది. దానిని నేను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో మూడుసార్లు ఈ చేదు అనుభవాన్ని చవిచూశాను. దక్షిణాదిలో పేరుపొందిన అగ్ర దర్శకుడి సినిమా ఆఫర్‌ నాకు వచ్చింది. ఆడిషన్స్‌కి వెళ్లాను. ఒకరోజు మొత్తం ఆడిషన్‌లోనే ఉన్నాను. దాంతో అనారోగ్యానికి గురి కావడంతో తిరిగి ముంబయి వెళ్లిపోయాను. ‘మీకు ఆరోగ్యం బాలేదు కదా నన్ను ముంబయికి రమ్మంటారా?’ అంటూ ఆ దర్శకుడు నాకు ఫోన్‌ చేశాడు. అవసరం లేదని చెప్పి ఫోన్‌ పెట్టేశాను. ఆ తర్వాత ఆయన వరుసగా ఫోన్లు చేయడం ప్రారంభించారు. నాకెందుకో కొంచెం అనుమానం వచ్చింది. అనంతరం ఆ దర్శకుడు వాళ్ల స్నేహితుడితో ఫోన్‌ చేయించి.. ‘ఈ సినిమా తెరకెక్కించడానికి చాలా సమయం పడుతుంది..  డైరెక్టర్‌గారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. సినిమా పూర్తయ్యే వరకే. ఆ తర్వాత కావాలంటే ఆపేయండి’ అని అన్నాడు. ఆయన మాటల్లోని భావం నాకు అర్థమైంది. నా టాలెంట్‌ నచ్చితే అవకాశం ఇవ్వండి.. లేకపోతే అవసరం లేదు.. అని గట్టిగా సమాధానమిచ్చాను. నాకు తెలిసి ఆ సినిమా ప్రారంభమైనట్లు లేదు. దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. ఒక దర్శకుడు నా కాళ్లు ఎలా ఉన్నాయో చూడాలనుకున్నాడు. మరొకరు నా శరీరభాగాలు చూడాలనుకున్నాడు’ అని సుర్వీన్‌ చావ్లా వివరించారు.

తెలుగులో తెరకెక్కిన ‘రాజు మహారాజు’లో సుర్వీన్‌ నటించారు. రాధికా ఆప్టే ప్రధాన పాత్ర పోషించిన ‘పర్చ్‌డ్‌’లోనూ ఆమె సందడి చేశారు. ఈ సినిమా తర్వాత ఆమె వెండితెరకు తాత్కాలికంగా దూరంగా ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని