శుక్రవారం శ్రీశైలం.. శనివారం అన్నవరం - annavaram and srishailam temples open
close
Published : 13/08/2020 22:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శుక్రవారం శ్రీశైలం.. శనివారం అన్నవరం

అమరావతి: కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏపీలో మూతపడ్డ ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరిగి తెరుచుకోనున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శ్రీశైలంలో దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. కంటైన్మెంట్‌ జోన్ల మినహాయింపుతో దర్శనాలకు మార్గం సుగమమైంది. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. కరోనా వల్ల శ్రీశైలంలో గత నెల 15 నుంచి దర్శనాలను నిలిపివేశారు. శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. 

మరోవైపు అన్నవరం దేవస్థానంలో శనివారం నుంచి యథావిధిగా దర్శనాలకు అనుమతించనున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే దర్శనాలు కల్పిస్తామని ఆలయ ఈవో త్రినాథరావు వెల్లడించారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని దర్శనాలు కొనసాగిస్తామన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని