‘స్వతంత్రవీర్ సావర్కర్’ చిత్రంలో హీరో ఎవరు? - eer savarkar biopic makers to approach randeep hooda ayushmann khurrana rajkummar rao
close
Published : 05/06/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘స్వతంత్రవీర్ సావర్కర్’ చిత్రంలో హీరో ఎవరు?

ఇంటర్నెట్‌ డెస్క్: గత కొంతకాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. చిత్రానికి ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’ అనే పేరు ఖరారు చేశారు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం పలువురు బాలీవుడ్‌ హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సినిమా కోసం హీరో ఆయుష్మాన్‌ ఖురానా, రణదీప్‌ హుడా, రాజ్‌కుమార్‌ రావ్‌లను సంప్రదించే యోచనలో నిర్మాణ సంస్థ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరికెవరూ తీసిపోరు. గతంలో హీరో రణదీప్‌ హుడా ‘సర్వ్‌జిత్‌’ చిత్రం కోసం ఏకంగా ఇరవై కిలోల బరువు తగ్గాడు. ఇక ఆయుష్మాన్‌ ఖురానా సైతం తను నటించే సినిమాలకి తనదైన శైలిలో స్థానిక మాండలికాలను నేర్చుకోవడంతో  పాటు నటనలోనూ వైవిధ్యం కనబరుస్తుంటాడు. రాజ్‌కుమార్‌ రావ్‌ ‘ట్రాప్పెడ్‌’, ‘బధాయి దో’ సినిమాల కోసం శారీరకంగా తనను తాను మార్చుకున్న సంగతి తెలిసిందే.

లెజెండ్‌ గ్లోబల్‌ స్టూడియో సమర్పణలో వస్తోన్న ఈ సినిమాని సందీప్ సింగ్, అమిత్ వాద్వానీ కలిసి నిర్మిస్తున్నారు. చిత్రానికి అనిర్బన్‌ ఛటర్జీ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. సంజయ్‌ శంక్లా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ లండన్‌, అండమాన్‌తో పాటు మహారాష్ర్టలోనూ జరగనుంది. చిత్రం గురించి దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ మాట్లాడుతూ ‘‘అండమాన్ జైలులో కఠినమైన శిక్షను అనుభవిస్తూ కూడా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో నాటి ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు వీర్ సావర్కర్. అలాంటి గొప్ప మహానుభావుడి జీవిత చరిత్రను తెరకెక్కించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం’’ అని తెలిపారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని