గంగాలో మృతదేహాలు: కేంద్రానికి NHRC నోటీసులు! - ganga dead bodies nhrc notices to centre and states
close
Published : 14/05/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గంగాలో మృతదేహాలు: కేంద్రానికి NHRC నోటీసులు!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న వేళ.. గంగా నదిలో వరుసగా మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో పాటు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. వీటిపైన ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను నాలుగు వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది.

‘గంగా నదిలో మృతదేహాలను విడిచిపెట్టడం క్లీన్‌ గంగా ప్రాజెక్టు నిబంధనలు ఉల్లంఘించడమే. ఈ సమయంలో మృతదేహాలను నదిలో విడిచిపెట్టడంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమయ్యింది’ అని కేంద్రం, రాష్ట్రాలకు ఇచ్చిన నోటీసుల్లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. గంగానదిలో లభ్యమైన మృతదేహాలు కొవిడ్‌కు సంబంధించినవే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలని ఆదేశించింది. నదిలో వచ్చినవి కొవిడ్‌ మృతదేహాలని.. వాటిని తొలగించే ప్రక్రియ సరిగా లేదంటూ వచ్చిన ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ విధంగా స్పందించింది. 

మరోవైపు గంగానదిలో మృతదేహాలు కొట్టుకురావడం కొనసాగుతూనే ఉంది. తాజాగా పీపీఈ కిట్లతో కూడిన రెండు మృతదేహాలు పట్నా సమీపంలోని గులాబీ ఘాట్‌కు కొట్టుకువచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. అంతకు ముందు బక్సార్‌ జిల్లాలో 71 మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని