close
Published : 26/02/2021 12:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్ష్మీదేవి ఎందుకంత రిచ్చో తెలుసా?

మంచు విష్ణు హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. రుహీ సింగ్‌ కథానాయిక. కాజల్‌ అగర్వాల్‌, సునీల్‌ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. గురువారం హీరో చిరంజీవి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘అడిగిన వెంటనే మా ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి సర్‌కి, సినిమాకి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన వెంకటేష్‌ సర్‌కు నా కృతజ్ఞతలు. 2015లో ఓ అక్కాతమ్ముడు కలిసి గుజరాత్‌, ముంబయిల్లోనే ఉంటూనే.. ఒక సులభమైన ఆలోచనతో అమెరికాలో డబ్బు రూ.4వేల కోట్ల వరకు స్కామ్‌ చేశారు. వాళ్లు అదెలా చేశారు? ఆ డబ్బు ఎక్కడుంది? ఇంతకి వాళ్లు దొరికరా? లేదా? అన్నది ఈ చిత్ర కథాంశం. అమెరికాలో నిజంగా జరిగిన కథ ఇది. ఈ కుంభకోణం వల్ల అక్కడ కొన్ని వేల కుటుంబాలు  అతలాకుతలం అయ్యాయి. హాలీవుడ్‌ స్థాయికి దీటుగా జెఫ్రీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒకరకంగా ఈ సినిమాలో కాజల్‌ది ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు.
సునీల్‌శెట్టి పోలీస్‌గా కనిపిస్తారు. నవదీప్‌, నవీన్‌ చంద్ర, వైవా హర్షా చక్కగా నటించారు’’ అన్నారు. ‘‘లక్ష్మీ దేవి ఎందుకంత రిచ్చో తెలుసా? నాలుగు చేతులతో సంపాదిస్తుంది కాబట్టి.’’, ‘‘డబ్బున్నోడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేం కాదు’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని