రామ్‌ చిత్రంలో మాధవన్‌, అరుణ్‌ విజయ్‌? - madhavan and arun vijay in lingusamys next rapo19
close
Published : 09/06/2021 23:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌ చిత్రంలో మాధవన్‌, అరుణ్‌ విజయ్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ఇస్మార్ట్ శంకర్‌’ హీరో రామ్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో తమిళ చిత్రసీమకు చెందిన మాధవన్‌, అరుణ్‌ విజయ్‌లు నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వారితో చిత్రబృందం సంప్రదించి, స్క్రిప్టుని కూడా వినిపించారట. కానీ వారి నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదని అంటున్నారు. ఈ వార్తపై పూర్తి సమాచారం తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ యాక్షన్‌ మూవీలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నాడట. గత నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. లాక్‌డౌన్‌ అంక్షలు ఎత్తేయగానే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు - తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. హీరో రామ్‌తో పాటు కృతి శెట్టికి తమిళంలో ఇదే మొదటి సినిమా అవుతోంది. మాధవన్‌ తెలుగులో ప్రేక్షకులకి పరిచయమే. ఇక అరుణ్‌ విజయ్‌ మాత్రం తెలుగులో రామ్‌చరణ్‌తో కలిసి ‘బ్రూస్‌ లీ’, ప్రభాస్‌తో కలిసి ‘సాహో’లో నటించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని