Rajinikanth: ‘పెద్దన్న’.. జాతర మొదలు - telugu news Rajinikanth Starer Peddanna Trailer Released
close
Updated : 28/10/2021 09:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajinikanth: ‘పెద్దన్న’.. జాతర మొదలు

‘‘నువ్వెవరనేది నువ్వు వెనకేసుకున్న ఆస్తిలోనో.. నీ చుట్టూ ఉన్న వాళ్లకి నీ మీద ఉన్న భయంలోనో లేదు. నువ్వు చేసే చర్యల్లోనూ.. మాట్లాడే మాటల్లోనూ ఉంటుంది. ఇది వేద వాక్కు’’ అంటున్నారు  రజనీకాంత్‌. ఆయన హీరోగా శివ తెరకెక్కించిన చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’గా రానుంది. నారాయణ్‌ దాస్‌.కె నారంగ్‌, డి.సురేష్‌బాబు నిర్మాతలు. ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ట్రైలర్‌ విడుదల చేశారు. రాజోలు   పరిసర గ్రామాలకు పంచాయతీ ప్రెసిడెంట్‌గా వీరన్న అనే పాత్రలో రజనీ నటించారు. ఆయన చెల్లెలుగా కీర్తి సురేష్‌, ప్రేయసిగా నయనతారను చూపించారు. మరదలిగా ఖుష్బు, కోడలిగా మీనా కనిపించారు. ప్రచార చిత్రం సాగిన తీరును బట్టి.. ఓ కుటుంబ కథాంశంతో చక్కటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందినట్లు అర్థమవుతోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ప్రకాశ్‌ రాజ్‌, జగపతిబాబు, అభిమన్యు సింగ్‌ శక్తిమంతమైన ప్రతినాయకుల పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా క్రూరమైన అవతారంలో జగపతిబాబు కనిపించిన విధానం.. ఆయన పలికిన సంభాషణలు ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. ‘‘న్యాయంగానూ ధైర్యంగానూ ఓ ఆడపిల్ల ఉంటే.. ఆ దేవుడే దిగి వచ్చి తనకు తోడుగా ఉంటాడు’’, ‘‘కలకత్తాకే బంధనం కట్టేశా. మా ఊరి పోతురాజుకు నిన్ను బలిస్తానని మొక్కుకున్నాను’’ అంటూ ట్రైలర్‌లో రజనీ చెప్పిన సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి. ‘‘ఈరోజు నుంచి మొదలవుతుంది జాతర’’ అంటూ ఆఖర్లో ఆయన చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి    సంగీతం: డి.ఇమ్మాన్‌, ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని