ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి - ten killed in an accident occured in gujarath
close
Updated : 18/11/2020 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కంటెయినర్‌, లారీ పరస్పరం ఢీకొన్న ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున వడోదర సమీపంలో జరిగింది. లారీ సూరత్‌ నుంచి పావగఢ్‌కు వెళ్తుండగా వడోదర శివారులోని వాగోడియా క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై కంటైనర్‌ను ఢీకొంది. దీంతో రహదారిపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని