బాక్సింగ్‌ రింగ్‌లో తూఫాన్‌ అతడు..! - toofaan official teaser out now
close
Updated : 12/03/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాక్సింగ్‌ రింగ్‌లో తూఫాన్‌ అతడు..!

ముంబయి: ‘భాగ్ మిల్కా భాగ్‌’ తర్వాత బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తూఫాన్‌’. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా మే 21న ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

కొట్లాటలంటే ఆసక్తి చూపించే ఓ యువకుడు బాక్సింగ్‌ను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? బాక్సర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందడానికి అతడు చేసిన కృషి ఏమిటి? ఆ యువకుడిని దేశం గర్వించే బాక్సర్‌గా తీర్చిదిద్దడానికి అతడి గురువు ఎంచుకున్న మార్గం ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇక, ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌, పరేష్‌ రావల్‌ కీలకపాత్రలు పోషించారు. రితేశ్‌ సిద్వాణీ, రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా, ఫర్హాన్‌ అక్తర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని