ఎన్టీఆర్‌ ‘చీమ చీమ..’ జపాన్‌లో...  - viral dancers hiromunieru and ashai sasaki once again came with new ntr song cheema cheema
close
Published : 11/08/2020 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ ‘చీమ చీమ..’ జపాన్‌లో... 

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఎన్టీఆర్‌ పక్కన స్టెప్పులేయాలని చాలా మంది హీరోయిన్లు ఆశిస్తుంటారు. కొంతమందైతే ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ను మ్యాచ్‌ చేయడం కష్టమే సుమా అంటుంటారు కూడా. అలాంటిది ఎన్టీఆర్‌ స్టెప్పులను చూసి... అచ్చు దింపేసింది ఓ డ్యాన్స్‌ జోడీ. వాళ్లు మన దేశానికి చెందినవారైతే ఓకే అనొచ్చు. కానీ వాళ్లు జపాన్‌కు చెందినవారంటే... చప్పట్లు మార్మోగించవచ్చు. 

ఆ మధ్య ‘అశోక్‌’ సినిమాలోని ‘గోల గోల..’ పాటకు కవర్‌ సాంగ్‌ చేసి ట్రెండ్‌ అయిన హీరోమునిరు, అతని సోదరి అశాహి ససాకీతో కలసి మరో కొత్త పాటతో వచ్చారు. ఈ సారి వారు ఎంచుకున్న పాట ‘సింహాద్రి’లోని ‘చీమ చీమ...’. ఎన్టీఆర్‌ హుషారైన స్టెప్పులు, అంకిత అందాలతో ఆ రోజుల్లో దుమ్ము రేపిన పాటకు జపాన్‌ జంట వేసిన ఆట వైరల్‌గా మారింది. 

ఎన్టీఆర్‌కు జపాన్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ సినిమాలకు ఆదరణ దక్కుతూ ఉంటుంది. అందుకే హీరోమునిరు, అశాహి ససాకీ ఎన్టీఆర్‌ పాటను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. ‘గోల గోల...’ అంటూ యూట్యూబ్‌లో వారి ఆటపాట వైరల్‌ అయ్యింది. భలే చేశారు.. అంటూ ఫ్యాన్స్‌ మెచ్చుకున్నారు. దాని తర్వాత ఆ పాట కోసం వారు పడ్డ కష్టాన్ని మేకింగ్‌ వీడియో రూపంలో పంచుకున్నారు కూడా. ఆ వీడియోలు ఇచ్చిన జోష్‌తో మరోసారి ‘చీమ చీమ..’ అంటూ వచ్చారు. 

పాట మొదట్లో బ్రహ్మానందం, రమ్యశ్రీ పాడిన సాకీని కూడా ఈ కవర్‌ సాంగ్‌లో అందించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌, అంకిత స్టెప్పులను అచ్చంగా దింపేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఒకే ఇంట్లో చిత్రీకరించిన పాట... ఇప్పుడు అంతర్జాలంలో సందడి చేస్తోంది. పాటలో హీరోహీరోయిన్‌ ధరించిన దుస్తుల లాంటివే ధరించి... హీరోమునిరు, అశాహి ససాకీ ఆకట్టుకున్నారు. ఆ పాటేంటో మీరే చూసేయండి.

‘గోల గోల..’ పాట.. దాని మేకింగ్‌ ఇక్కడ చూడొచ్చు... 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని