15 చిత్రాల నిర్మాణం.. యువతకు ఆహ్వానం - pk creative works encourages the writers
close
Published : 03/04/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15 చిత్రాల నిర్మాణం.. యువతకు ఆహ్వానం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ రచయిత, దర్శకుడు కావాలని కలలు కనే యువతకు శుభవార్త వినిపించాయి పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఎల్‌.ఎల్‌.పి. నిర్మాణ సంస్థలు. పరిమిత బడ్జెట్‌, భారీ బడ్జెట్‌లో 15 చిత్రాల్ని సంయుక్తంగా నిర్మించేందుకు ఈ సంస్థలు సిద్ధమవుతున్నాయి. రచన, దర్శకత్వంపై ఆసక్తి ఉన్న యువతని వీటిలో భాగస్వామిని చేయబోతున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశాయి. కొత్త ఆలోచల్ని, విభిన్న కథల్ని బహుభాషల్లో తెరకెక్కించగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశాయి. దీనికి హరీశ్‌ పాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా కీలక బాధ్యత వహిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి టీజీ విశ్వ ప్రసాద్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్స్క్‌కి పవన్‌ కల్యాణ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని