సోనాక్షి కొత్త చిత్రం ‘కకుడా’ - sonakshi sinha new movie title as kakuda
close
Published : 21/07/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనాక్షి కొత్త చిత్రం ‘కకుడా’

ముంబయి: హారర్‌కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో అలాంటి మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనాక్షి సిన్హా, రితేష్‌ దేశ్‌ముఖ్, సాక్విబ్‌ సలీమ్‌ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం ‘కకుడా’. హారర్‌ కామెడీ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోట్‌దర్‌ ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఓ వింతశాపానికి గురైన ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ ఇదని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం మొదలైంది. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. సోనాక్షి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కకుడ లాంటి వినోద చిత్రం చాలా అవసరం. ఓ ప్రేక్షకురాలిగా ఇలాంటి సినిమాల్ని నేను బాగా ఆస్వాదిస్తాను’’ అని చెప్పింది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని