కొవిడ్‌ ఆస్పత్రిలో నిర్లక్ష్యం: ఆ వృద్ధుడి మృతి
close

తాజా వార్తలు

Updated : 03/07/2020 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ ఆస్పత్రిలో నిర్లక్ష్యం: ఆ వృద్ధుడి మృతి

విజయవాడ: విజయవాడలోని కొవిడ్‌ ఆస్పత్రిలో అదృశ్యమైన వృద్ధుడి ఆచూకీ లభ్యమైంది. ఆ ఆస్పత్రిలోనే అతడి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. గత నెల 24న కరోనా ఆస్పత్రికి వెళ్లిన వృద్ధుడు మృతి చెందాడు. అదే రోజు మృతిచెందినట్టు అధికారులు ఇప్పుడు వెల్లడించడం అక్కడి నిర్లక్ష్య ధోరణికి అద్దంపడుతోంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే, ఆ వృద్ధుడి భార్య తన భర్త ఆచూకీ తెలపాలంటూ ఎన్నిసార్లు ఆస్పత్రి సిబ్బందిని అడిగినా సరైన సమాధానం రాలేదు. తమకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రిలోని సీసీ ఫుటేజీని పరిశీలించగా.. ఆ వృద్ధుడిని ఆస్పత్రిలోనికి తీసుకెళ్లినట్టు గుర్తించిన విషయం తెలిసిందే. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని