close

తాజా వార్తలు

Published : 27/02/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్య

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కోదాడ పెద్ద చెరువులో దూకి యువతీ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. కోదాడ లక్ష్మీపురం కాలనీకి చెందిన యువకుడు, అదే ప్రాంతానికి చెందిన యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి  అంగీకరించరనే భయంతో గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ప్రేమ జంట అదృశ్యంపై ఇరు కుటుంబాల పెద్దలు వేర్వేరుగా కోదాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

  ఈరోజు ఉదయం కోదాడలోని పెద్దచెరువు కట్టపైకి ఉదయపు నడకకు వెళ్లిన కొందరు  అక్కడ పడి ఉన్న దుస్తుల బ్యాగును గుర్తించి అందులోని ఆధార్‌ కార్డు ఆధారంగా పోలీసులు, లక్ష్మీపురం గ్రామస్థులకు సమాచారం అందించారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి చెరువులోని మృతదేహాలను బయటకు తీశారు. బంధువులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని