రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

తాజా వార్తలు

Published : 07/01/2021 01:07 IST

రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రింగురోడ్డు: విజయనగరం మండలం కోరాడపేట సమీపంలో బుధవారం రాత్రి జరిగి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి మామిడి సతీశ్‌, జి.రవికుమార్‌, శ్యాంసుందర్‌, విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో జరిగే వివాహానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. విజయనగరం మండలం కోరుకొండ ప్రాంతానికి చెందిన ప్రజ్వల్‌, కె.రవికుమార్‌, రాజు ద్విచక్రవాహనంపై కోరాడపేట వైపు వస్తుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మామిడి సతీశ్‌(22), ప్రజ్వల్‌(18) అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కె.రవికుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 

ఇదీ చదవండి..

కన్నీరు పెట్టిస్తోన్న బీటెక్‌ విద్యార్థి సెల్ఫీ వీడియో


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని