కోల్‌కతా నకిలీ ఎస్సై చిక్కాడు
close

ప్రధానాంశాలు

Updated : 15/06/2021 11:22 IST

కోల్‌కతా నకిలీ ఎస్సై చిక్కాడు

రుణయాప్‌ల ఖాతాల్లో రూ.1.18 కోట్లు విడుదల చేయించేందుకు వేషం

మరో స్నేహితుడితో పథకం... మళ్లించుకున్న నగదుపై పోలీసుల ఆరా


అనిల్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: చైనా కంపెనీలకు సంబంధించిన బ్యాంక్‌ ఖాతాల్లో పోలీసులు స్తంభింపజేసిన రూ.1.18 కోట్ల నగదును కోల్‌కతాకు వెళ్లి విడుదల చేయించిన నకిలీ ఎస్సై నల్లమోతు అనిల్‌ కుమార్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేశారు. గుర్‌గావ్‌, కోల్‌కతాల్లోని ఐసీఐసీఐ బ్యాంకుల్లో చైనా కంపెనీలకు చెందిన వందల ఖాతాల్లో రూ.126 కోట్లను పోలీసులు స్తంభింపజేశారు. ఏప్రిల్‌ రెండోవారంలో అనిల్‌.. ఎస్సైగా గుర్తింపుకార్డు తయారు చేసుకుని కోల్‌కతా వెళ్లాడు. అలీపూర్‌ శాఖకు వెళ్లి బ్యాంక్‌ అధికారులను బెదిరించి రెండు ఖాతాల్లోని రూ.1.18 కోట్లను తన స్నేహితుడు, బేగంపేటలో ఉంటున్న ఆనంద్‌ ఖాతాల్లోకి బదిలీ చేయించాడు. హైదరాబాద్‌కు వచ్చి ఆ డబ్బును ఇతర ఖాతాల్లోకి మళ్లించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఐసీఐసీఐ బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్‌ను అరెస్ట్‌ చేశారు.

గుంటూరు.. హైదరాబాద్‌.. ముంబయి..

గుంటూరుకు చెందిన నల్లమోతు అనిల్‌కుమార్‌ ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ వచ్చాడు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో ఆరేళ్ల క్రితం ముంబయి వెళ్లాడు. కొద్దిరోజులున్నాక మళ్లీ హైదరాబాద్‌ వచ్చాడు. పెళ్లయ్యాక మల్కాజిగిరిలోని సాకేత్‌లో కొన్నేళ్లున్నాడు. తరచూ ముంబయికి వెళ్లి వస్తూ, డబ్బు తెచ్చేవాడు. ఇతన్ని ఐదేళ్ల క్రితం సైబర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశాకే నేరాలు చేస్తున్నాడని కుటుంబసభ్యులకు తెలిసింది. జైలు నుంచి విడుదలయ్యాక భార్యా పిల్లలను పట్టించుకోకుండా ముంబయికి వెళ్లాడు. అక్కడో స్నేహితురాలితో ఉంటున్నాడని గుర్తించారు.

స్నేహితుడి కోసం గాలింపు

నకిలీ ఎస్సైగా నటించిన అనిల్‌ కుమార్‌ను విచారించిన పోలీసులు రూ.1.18 కోట్ల బదిలీలో అతడి మరో స్నేహితుడు కీలకపాత్ర పోషించాడని గుర్తించారు. అనిల్‌ విడుదల చేయించిన సొమ్మును ఆ స్నేహితుడే వేర్వేరు ఖాతాలకు మళ్లించినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నామని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ అధికారులపై పోలీసులు ఫిర్యాదు చేసేందుకు యోచిస్తున్నారు. కోల్‌కతా నుంచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై అనిల్‌ను తీసుకువచ్చిన పోలీసులు కోర్టులో హాజరు పరిచాక జైలుకు తరలించారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల నగదు 8 డెబిట్‌కార్డులు, చరవాణులు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌ తెలిపారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన