కడప జిల్లాలో సర్పంచి దారుణ హత్య

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 13:17 IST

కడప జిల్లాలో సర్పంచి దారుణ హత్య

లింగాల, న్యూస్‌టుడే: కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల వైకాపా మద్దతు సర్పంచి కనం మునెప్ప(50)ను ప్రత్యర్థులు గ్రామం సమీపంలో వేటకొడవళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. పులివెందులలో మంగళవారం జరిగిన సర్పంచి శిక్షణ తరగతులకు హాజరై అక్కడే భోజనం చేసి ద్విచక్రవాహనంపై ఓబుళరెడ్డి అనే వ్యక్తితో కలిసి గ్రామానికి మునెప్ప బయలుదేరారు. గ్రామానికి సమీపంలో పది మంది కలిసి ద్విచక్రవాహనాన్ని అడ్డుకున్నారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరకడంతో ఆయన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. ప్రత్యర్థులు వైకాపాకు చెందినవారేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి రామకృష్ణమ్మపై ఆయన గెలుపొందారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన