close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌తో మరో ఇద్దరు మృతి

పదకొండుకు చేరిన మృతులు

తాజాగా 27 పాజిటివ్‌ కేసుల నమోదు

ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. శుక్రవారం రిమ్స్‌లో చికిత్స పొందుతూ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మృత్యువాత పడినట్లు జిల్లా వైద్యారోగ్యాధికారి రాఠోడ్‌ నరేందర్‌ వెల్లడించారు. మహాలక్ష్మీవాడకు చెందిన మహిళ(55) కరోనా బారిన పడి పరిస్థితి విషమించగా నాలుగు రోజుల కిందట రిమ్స్‌ వైద్యులు రిఫర్‌ చేశారు. ఆమె నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 11కి చేరింది. శుక్రవారం 28 మంది కోలుకొని డిశ్ఛార్జి కాగా మరో 357 మంది కరోనా క్రియాశీలక బాధితులున్నారు. ఇందులో పన్నెండు మంది రిమ్స్‌ ఐసోలేషన్‌లో, హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో, ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరు, 342 మంది హోంఐసోలేషన్‌లో చికిత్సలు పొందుతున్నారు.

ప్రాంతాల వారీగా పాజిటివ్‌ వివరాలు..

జిల్లాలో శుక్రవారం కొవిడ్‌ పాజిటివ్‌ బారిన పడ్డ వారిలో 17 మంది పురుషులు, పది మంది మహిళలు ఉన్నారు. ప్రాంతాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. టీచర్స్‌ కాలనీ, బ్రాహ్మణవాడల్లో ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క మహిళ, అశోక్‌రోడ్డులో ఇద్దరు, మసూద్‌కూడలిలో ఇద్దరు, శాంతినగర్‌లో ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ, తలమడుగు మండలం దేవాపూర్‌లో ఇద్దరు, సుంగాపూర్‌(ఝరి) ఇద్దరు మహిళలు, భుక్తాపూర్‌, బోథ్‌ మండలం సొనాల, ఉట్నూర్‌ మండలం శ్యాంపూర్‌, ఇంద్రవెల్లి(వృద్ధుడు), నార్నూర్‌(ఆరు సంవత్సరాల బాలుడు), భీంపూర్‌, రాంనగర్‌, పిట్టలవాడల్లో ఒక్కొక్కరు చొప్పున పాజిటివ్‌ బారిన పడ్డట్లు జిల్లా వైద్యారోగ్యాధికారి రాఠోడ్‌ నరేందర్‌ వెల్లడించారు.

రిమ్స్‌లో నలుగురికి..

శుక్రవారం వెల్లడించిన నివేదికల్లో రిమ్స్‌ జూనియర్‌ వైద్యుడు ఒకరు, మరో ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడ్డారని వైద్యాధికారులు వెల్లడించారు.

కరోనాతో మృతి చెందిన వ్యక్తిని తరలించేందుకు ఏర్పాట్లు చేయిస్తున్న సాజిద్‌ఖాన్‌

మతలాంఛనాలతో అంత్యక్రియలు

కొవిడ్‌ పాజిటివ్‌తో మృతి చెందిన బొక్కలగూడకు చెందిన వ్యక్తి మృతదేహాన్ని కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ చొరవతో మత లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కొవిడ్‌ వార్డుకు వెళ్లి పురపాలక సంఘం, పోలీసు అధికారులు, రిమ్స్‌ సిబ్బందితో మాట్లాడి కొవిడ్‌ నిబంధనల మేరకు అంత్యక్రియలు జరిగేలా ఏర్పాట్లు చేశారు.

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలం ధనోర(బి) పంచాయతీ కేంద్రంలో 70ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యుడు రాఠోడ్‌ శ్రీకాంత్‌ తెలిపారు.

తలమడుగు: మండలంలోని దేవాపూర్‌కు చెందిన 11 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా శుక్రవారం ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

నార్నూర్‌: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో శుక్రవారం 25 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యులు వెల్లడించారు. గురువారం ఆదిలాబాద్‌ రిమ్స్‌ నుంచి పరారై సుంగాపూర్‌ గ్రామానికి చేరి మృత్యువాత పడటంతో కరోనా వ్యాప్తి చెంది ఉంటుందని ఝరి పీహెచ్‌సీ వైద్యాధికారి డా.సూరత్‌ శనివారం 14 మంది గ్రామస్థులకు పరీక్షలు చేయగా ఇద్దరు మహిళలకు పాజిటివ్‌ వచ్చిందన్నారు. పాజిటివ్‌ వచ్చి హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులను పరీక్షించగా ఆరేళ్ల చిన్నారికి పాజిటివ్‌గా తేలిందని నార్నూర్‌ పీహెచ్‌సీ హెచ్‌ఈవో నాందేవ్‌ చవాన్‌ వెల్లడించారు.

నిపానిలో మరొకరికి..

భీంపూర్‌: మండలంలోని నిపానిలో మరొకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. ఇదివరకు పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబీకులకు శుక్రవారం పరీక్షలు చేయగా.. అందులో 68ఏళ్ల వృద్ధురాలికి కరోనా సోకినట్లు తేలింది.

శ్యాంపూర్‌లో ఒకరికి..

ఉట్నూర్‌ గ్రామీణం: ఉట్నూర్‌ మండలం శ్యాంపూర్‌కు చెందిన 40ఏళ్ల వ్యక్తికి పీహెచ్‌సీలో శుక్రవారం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి డా.సాహిత్య తెలిపారు.


ఉపాధ్యాయినికి అంత్యక్రియలు చేసిన కాలనీయువకులు

పాలనాప్రాంగణం: ఆదిలాబాద్‌పట్టణం మహాలక్ష్మివాడకు చెందిన ఉపాధ్యాయిని కిషోరి చౌహాన్‌ కరోనా మృతిచెందగా కాలనీవాసులు ఆమె అంత్యక్రియలు జరిపి మానవత్వం చాటుకున్నారు. మృతదేహాన్ని మావల సమీపంలోని శ్మశానవాటికకు కుటుంబీకులు తరలించగా.. మున్సిపల్‌ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కౌన్సిలరు గండ్రత్‌ రేఖ తనయుడు, బీజేవైఎం పట్టణాధ్యక్షుడు మహేందర్‌ కాలనీ యువకులతో కలసి పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.


మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.