ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం


మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా

మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను సమర్థంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా అన్నారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో మంగళవారం జగనన్న గోరుముద్ద వెబ్‌సైట్‌లో డ్యాష్‌బోర్డు, ఐఎంఎంఎస్‌ యాప్‌ను ఏ విధంగా నిర్వహించాలి అనే అంశంపై కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల పారదర్శకమైన సేవలు అందుతాయని తెలిపారు. శిక్షణతో ఉద్యోగులు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ఉప విద్యాశాఖాధికారులు చంద్రకళ, కమల కుమారి, సుబ్బారావు, జిల్లా సైన్స్‌ అధికారి హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా అధ్యాపకుల బదిలీలు

మాచవరం, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల బదిలీల ప్రక్రియను స్థానిక ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. కళాశాల విద్య కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా బదిలీ ప్రక్రియ నిర్వహించినట్లు జాయింట్‌ డైరెక్టర్‌ ఆర్‌.డేవిడ్‌ కుమార్‌ స్వామి తెలిపారు. ఇందులో 520 మంది అధ్యాపకులు పాల్గొన్నట్లు చెప్పారు. అలాగే నాన్‌ అటానమస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల బదిలీలు చేస్తామన్నారు. ఇప్పటికే కొందరు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకున్నారని చెప్పారు.

* అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు విద్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఆర్‌.డేవిడ్‌ కుమార్‌స్వామి తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రవేశాల నమోదు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్స్‌ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని