ఉద్యోగినులకు అండగా ఉంటాం
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

ఉద్యోగినులకు అండగా ఉంటాం


ఏపీ ఎన్జీవో, సచివాలయ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

మంగళగిరి, న్యూస్‌టుడే: సత్వర స్పందన ద్వారా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే స్త్రీ ఉద్యోగులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు. మంగళగిరిలోని మహిళ కమిషన్‌ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆమె ఏపీ ఎన్జీవో, సచియవాలయ మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కమిషన్‌ కార్యాలయ డైరెక్టర్‌ ఆర్‌.సూయజ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులేస్తోందన్నారు. స్త్రీల రక్షణ, భద్రత, సంక్షేమంలో ప్రభుత్వ ఆలోచనలు క్షేత్ర స్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయన్నారు. గతంతో పోల్చితే మహిళ ఉద్యోగులు ధైర్యంగా ఫిర్యాదులు చేసేలా వాతావరణం నెలకొందన్నారు. అనంతరం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని బూతులతో సంబోధించడం ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేయడమేనన్నారు. తెదేపా నాయకులు చేస్తున్న ఆరోపణలు, దూషణలను తీవ్రంగా ఖండించారు.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని