Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోడల్‌ అధికారుల నియామకం

చిత్తూరు(జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి నియంత్రణ నిమిత్తం నోడల్‌ అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ హరినారాయణన్‌ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. జిల్లా స్థాయి నోడల్‌ అధికారిగా డాక్టర్‌ శరవణ శ్రీనివాస్‌ను నియమించారు. కొవిడ్‌ పరీక్షల నోడల్‌ అధికారిగా డాక్టర్‌ రమేష్‌బాబు, శాంపిల్‌ కలెక్షన్‌, సర్వే లెన్స్‌-డాక్టర్‌ శ్రీవాణి, శాంపిల్స్‌ రవాణా-డాక్టర్‌ సుదర్శన్‌, ల్యాబ్‌ సమన్వయకర్త-డాక్టర్‌ యుగంధర్‌. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌-డీపీవో దశరథరామిరెడ్డి, అదనపు డీఎంహెచ్‌వో రమాదేవి. హోమ్‌ క్వారంటైన్‌ పర్యవేక్షణ-జడ్పీ సీఈవో రాజశేఖర్‌, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌/శాంపిల్‌ కలెక్షన్‌-అదనపు డీఎంహెచ్‌వో రమాదేవి, కంటైన్మెంట్‌ క్లస్టర్ల ఏర్పాటు/ఫీవర్‌ క్లినిక్‌ నిర్వహణ-మలేరియా అధికారి పైడిరాజు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఏర్పాటు బాధ్యతలను డివిజనల్‌ స్థాయిలో సబ్‌కలెక్టర్‌/ ఆర్డీవోలు పర్యవేక్షించనున్నారు. పాజిటివ్‌ వ్యాధిగ్రస్తుడి క్రిటికల్‌ కేర్‌, ట్రయేజింగ్‌, అడ్మిషన్లు-డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ, డీఎస్‌డబ్ల్యూవో రాజ్యలక్ష్మీ, డెమో నిర్మలమ్మ. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వసతుల ఏర్పాటు-ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త బాలాంజనేయులు, హోమ్‌ ఐసోలేషన్‌-డాక్టర్‌ అరుణసులోచనాదేవి, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జి- ఎస్‌వో రమేష్‌, హెల్ప్‌ డెస్క్‌/సీసీ టీవీ మానిటరింగ్‌-డాక్టర్‌ నిరంజన్‌, వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణ డీఐవో హనుమంతరావు, వ్యాక్సినేషన్‌ మొబిలైజేషన్‌ బాధ్యతలను డీపీవో దశరథరామిరెడ్డి, జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో రాజశేఖర్‌, డీఆర్‌డీఏ పీడీ తులసి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని