‘బయట తిరిగితే క్రిమినల్‌ కేసులు నమోదు’
logo
Published : 29/03/2020 01:35 IST

‘బయట తిరిగితే క్రిమినల్‌ కేసులు నమోదు’

మాడ్గుల, న్యూస్‌టుడే: ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మండలానికి వచ్చిన వారు ఇళ్లల్లో ఉండకుండా బయట తిరిగితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సిఐ సైదులు హెచ్చరించారు. మండలంలోని అప్పారెడ్డిపల్లి, జయరాంతండా, తదితర గ్రామాలు, తండాల్లో శనివారం ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. కొద్ది రోజులుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి చెప్పామన్నారు. కొంత మంది బయట తిరుగుతున్నట్లు తెలుసుకొని వారిని పిలిపించి నచ్చచెప్పి చప్పట్లు కొట్టించామన్నారు. ఇక పై బయటి తిరిగినట్లు తెలిస్తే వారి పై తప్పక కఠిన చర్యలు చేపడ్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఫారూఖ్‌హుసేన్‌, వైద్యాధికారి శ్రీనివాస్‌, సర్పంచి పద్మ, కార్యదర్శి తిరుపతి, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని