Crime News: స్నానపు గదిలో కెమెరా కేసు దర్యాప్తు ముమ్మరం
eenadu telugu news
Updated : 24/09/2021 07:20 IST

Crime News: స్నానపు గదిలో కెమెరా కేసు దర్యాప్తు ముమ్మరం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని వన్‌ డ్రైవ్‌ ఇన్‌ హోటల్లో స్నానపుగదిలో చరవాణి పెట్టి వీడియో తీసిన కేసులో జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడ పనిచేస్తున్న బాలుడు(17) మంగళ, బుధవారాల్లో చరవాణిని అమర్చినట్లు గుర్తించారు. అతనిని బుధవారమే అదుపులోకి తీసుకున్నారు. చరవాణిలో నాలుగు గంటల వీడియో రికార్డు అయినట్లు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు మహిళా సంఘాల సభ్యులతో పాటు బాధిత మహిళల కుటుంబ సభ్యులు హోటల్‌ వద్ద ఆందోళనకు దిగుతారనే సమాచారంతో ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సైలు నవీన్‌రెడ్డి, చంద్రశేఖర్‌ గురువారం బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలుడిని పునరావాస కేంద్రానికి తరలించారు. హోటల్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌ను రిమాండ్‌కు తరలించారు.

మరోవైపు ఈ కేసులో వన్‌ డ్రైవ్‌ ఇన్‌ హోటల్‌ యజమాని చైతన్యను కూడా పోలీసులు విచారించారు. కేశవ్‌ అనే వ్యక్తి గురించి ఆరా తీశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని