నగ్న దృశ్యాలు బహిర్గతం చేస్తానని డబ్బులు డిమాండ్‌
eenadu telugu news
Published : 19/10/2021 06:44 IST

నగ్న దృశ్యాలు బహిర్గతం చేస్తానని డబ్బులు డిమాండ్‌

మనోహరాబాద్‌: వాట్సాప్‌లో వీడియో కాల్‌ ద్వారా నగ్న దృశ్యాలు నమోదు చేసి.. వాటితో ఓ విద్యార్థిని బెదిరించిన సంఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలో జరిగింది. ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపిన వివరాలు.. మనోహరాబాద్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి ఒకరికి ఈ నెల 11న గుర్తు తెలియని వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి వాట్సాప్‌ నంబర్‌ సేకరించాడు. అదే రోజు వాట్సాప్‌లో వీడియో కాల్‌ చేసి.. నగ్నంగా ఉంటూ తనతో మాట్లాడమని సూచించిన విధంగా బాత్రూమ్‌లోకి వెళ్లి విద్యార్థి చేశాడు. ఆ వీడియో దృశ్యాన్ని విద్యార్థికి పంపి, సామాజిక మాధ్యమాల్లో పెడతానని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించాడు. భయపడిన యువకుడు ఫోన్‌పే ద్వారా రూ.14133 పంపాడు. రెండు రోజుల తరువాత మళ్లీ ఫోన్‌ చేసి డబ్బులు అడగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని