నగరపాలికలో ఆస్కి ప్రతినిధుల పరిశీలన
eenadu telugu news
Published : 29/07/2021 04:06 IST

నగరపాలికలో ఆస్కి ప్రతినిధుల పరిశీలన

నగరపాలక కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌తో సమావేశమైన ఆస్కి ప్రతినిధి బృందం

గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే: రామగుండం నగరపాలక ప్రాంతంలో అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కి) ప్రతినిధులు బుధవారం పర్యటించారు. మూడు రోజుల పాటు వీరి పర్యటన ఉంటుంది. ఆయా విభాగాల్లో ప్రస్తుతం రామగుండం నగరపాలిక తీసుకుంటున్న చర్యలతో పాటు మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బృందం పరిశీలించి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా రామగుండం నగరపాలక ప్రాంతంలో పారిశుద్ధ్యం, మురుగు నిర్వహణ, తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు బల్దియా చర్యలు తీసుకోనున్నారు. బుధవారం కమిషనర్‌ పి.ఉదయ్‌కుమార్‌తో సమావేశమైన వీరు రామగుండంలో పారిశుద్ధ్యం, మురుగు నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. అనంతరం నగరంలోని సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక పారిశుద్ధ్య పర్యవేక్షకులు కిషోర్‌కుమార్‌, పవన్‌కుమార్‌, పర్యావరణ ఇంజినీర్‌ మధూకర్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని