ఒక్కరోజులో రూ.9 కోట్ల రుణాలు
eenadu telugu news
Published : 17/09/2021 02:56 IST

ఒక్కరోజులో రూ.9 కోట్ల రుణాలు


ఖాతాదారుకు రుణమంజూరు పత్రాన్ని అందిస్తున్న బ్యాంకు ఛైర్మన్‌ రాకేష్‌ కశ్యప్‌

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే : జిల్లాలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు 91 శాఖల్లో ఒక్కరోజు రూ.6 కోట్ల డిపాజిట్లు సేరించటంతో పాటు రూ.9 కోట్ల రుణాలను పంపిణీ చేశామని ఆ బ్యాంకు ఛైర్మన్‌ రాకేష్‌ కశ్యప్‌ తెలిపారు. నెల్లూరులోని విజమహల్‌గేట్‌ సమీపంలోని ఆంధ్ర మహాసభలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సేకరించిన డిపాజిట్ల కన్నా అధికంగా రుణాలను మంజూరు చేస్తున్న ఘనత గ్రామీణ బ్యాంకులకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఆ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ వి.కోటేశ్వరరావు, చీఫ్‌ మేనేజర్‌ రమణ తదితరులు పాల్గొన్నారు. అంతకముందు ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ చక్రధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు.

ఫిట్‌ ఇండియా క్విజ్‌కు పేర్ల నమోదు
నెల్లూరు (క్రీడా విభాగం) : ఫిట్‌ ఇండియా క్విజ్‌లో పాల్గొనేందుకు నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి ఎం.దేవిక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా తరఫున ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు నమోదు పూర్తిగా ఉచితమని, ఆపైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50 చొప్పున చెల్లించి నమోదు చేసుకోవాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని