పత్తి పొలంలోగంజాయి మొక్కలు
eenadu telugu news
Published : 22/10/2021 03:12 IST

పత్తి పొలంలోగంజాయి మొక్కలు

పొలంలో గంజాయి మొక్కలు తొలగిస్తున్న సెబ్‌ సిబ్బంది

బేస్తవారపేట, న్యూస్‌టుడే: పత్తి పొలంలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను సెబ్‌ అధికారులు గురువారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సెబ్‌ ఎస్సై జెట్టి వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. మండలంలోని చెన్నుపల్లికి చెందిన లక్కమనేని చెంచమ్మ అనే మహిళా రైతు సమీప పొలాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఎవరూ గుర్తించకుండా ఉండేలా అందులో అక్కడక్కడ గంజాయి మొక్కలు నాటారు. సమాచారం అందుకున్న సెబ్‌ అధికారులు గురువారం దాడి చేశారు. చెంచమ్మ పొలంలో సాగు చేసిన 310 గంజాయి మొక్కలను గుర్తించి పీకి వేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. గంజాయి సాగు నేరమని ఆ శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులునాయుడు తెలిపారు. కార్యక్రమంలో సెబ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

స్వాధీనం చేసుకున్న వాటినిపరిశీలిస్తున్న అధికారులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని