పీజీ, బీటెక్‌ కోర్సుల రెండో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా
eenadu telugu news
Published : 21/09/2021 05:27 IST

పీజీ, బీటెక్‌ కోర్సుల రెండో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ, బీటెక్‌ కోర్సుల రెండో సెమిస్టర్‌ పరీక్షలను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసినట్లు పీజీ పరీక్షల నిర్వహణ డీన్‌ బిడ్డికి అడ్డయ్య ప్రకటించారు. వర్సిటీలో సోమవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 22 నుంచి పీజీ రెండు, 27 నుంచి బీటెక్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహణకు తొలుత నిర్ణయించారు. అయితే నిర్దేశించిన గడువులో సిలబస్‌ పూర్తికాలేదని విద్యార్థుల నుంచి వస్తున్న వినతులతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగ పరీక్షలు మాత్రం ముందు నిర్ణయించిన 28, 29, 30 తేదీల్లోనే జరుగుతాయని డీన్‌ స్పష్టం చేశారు. పీజీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలని సోమవారం ఉదయం ఏబీవీపీ నేతలు, విద్యార్థులు వర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని