మీ వద్దకే టీకా
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

మీ వద్దకే టీకా

గిరిజన ప్రాంతాల్లో టీకాలు వేసే కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది ముమ్మరంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా రామభద్రపురం పీహెచ్‌సీ వైద్యుడు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది బుధవారం పలు గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ, కూలి పనులు చేసుకుంటున్న వారి వద్దకు వెళ్లి టీకాలు వేస్తున్నారు. గిరిశిఖర గ్రామం పూసనందిలో ఓ భవన నిర్మాణం చేస్తున్న వారి వద్దకే వెళ్లి టీకా వేశారు. మరోవైపు కొమరాడ పీహెచ్‌సీ వైద్యాధికారి అనిల్‌ ఆధ్వర్యంలో గుమడలో అవగాహన కల్పించారు.- న్యూస్‌టుడే, కొమరాడ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని