సీసీఐ సీఎండీగా సంజయ్‌బంగా
eenadu telugu news
Published : 18/10/2021 02:27 IST

సీసీఐ సీఎండీగా సంజయ్‌బంగా

 

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) కర్మాగారాల నూతన సీఎండీగా సంజయ్‌బంగా శుక్రవారం నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన దిల్లీలోని సీసీఐ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన ఐఆర్‌ఈఎల్‌ ఇండియా లిమిటెడ్‌, యూరేనియం కార్పొరేషన్‌లో ముఖ్య నిఘా అధికారిగా, ఎంటీఎన్‌ఎల్‌లో ముఖ్య నిపుణులుగా బాధ్యతలు నిర్వహించారు. తాండూరు మండలం కరణ్‌కోటలోని సీసీఐ కర్మాగారాన్ని త్వరలో సందర్శించే అవకాశాలున్నాయని పర్సనల్‌ మేనేజర్‌ అమిత్‌రంజన్‌ ఆదివారం తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని