close

మంగళవారం, ఆగస్టు 20, 2019

ప్రధానాంశాలు

ఉన్నత విద్యకు బాటలు

దూరవిద్యకు ముస్లిం యువతుల చేరువ
‘మనూ’ కోర్సుల్లో వారిదే హవా
గతేడాది 8300 మందిలో 3900 మంది వారే
ఈనాడు, హైదరాబాద్‌

ఆర్థిక ఇబ్బందులు.. సామాజిక కారణాలు.. కట్టుబాట్లు.. కారణాలు ఏవైతేనేం ఒకప్పుడు చదువు కొనసాగించలేకపోయారు. ఇంటర్‌తోనే విద్యకు స్వస్తి చెప్పారు. ఆర్థిక స్తోమత లేని కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలకు వివాహాలు చేసి పంపిచేస్తున్నారు. అయితే ఉన్నత విద్యను అభ్యసించి డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనే కలను దూరవిద్య విధానంతో నెరవేర్చుకుంటున్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇళ్ల వద్దనే ఉండి చదువుకుంటూ ఉన్నత విద్య కలను నెరవేర్చుకుంటున్నారు. బాలురతో సమానంగా ప్రవేశాలు పొంది చదువులో రాణిస్తున్నారు. గచ్చిబౌలిలోని ‘మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం’ (ఎంఏఎన్‌యూయూ - మనూ)లోని దూరవిద్య కోర్సుల్లో చేరుతున్న వారిలో ముస్లిం మహిళలు అధికంగా ఉంటున్నారు. మనూలో దూరవిద్య కోర్సులకు విపరీతమైన ఆదరణ ఉంది. రెగ్యులర్‌ కోర్సుల్లో సీట్ల పరిమితికితోడు జాతీయస్థాయిలో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా 4 వేల మందికి ప్రవేశాలు కల్పించి బోధన చేస్తున్నారు. అదే దూరవిద్య కోర్సుల్లో మాత్రం రెగ్యులర్‌కంటే పదింతలు ఎక్కువగా ప్రవేశాలున్నాయి. నిత్యం తరగతులకు వచ్చి చదువుకోలేనివారు, వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ విద్యాసామర్థ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నించేవారు ఇందులో చేరుతున్నారు. ప్రస్తుతం వర్సిటీలో 40 వేల మంది దూరవిద్య విధానంలో చదువుకుంటున్నారు. వీరిలో 50 శాతం మంది ముస్లిం మహిళలే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూనే దూరవిద్యలో చేరి ఖాళీ సమయాల్లో చదువుకొంటూ పట్టభద్రులుగా ఎదుగుతున్నారు. 2018-19 సంవత్సరానికి మనూలోని దూరవిద్య కోర్సుల్లో 8360 మంది ప్రవేశాలు తీసుకోగా వీరిలో 3900 మంది అమ్మాయిలే ఉన్నారు. ఈ కోర్సుల్లో బీఈడీ మినహా ఇతర తరగతులకు కచ్చితంగా రానక్కర్లేదు. సైన్స్‌ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు హాజరు కావాలి. దీంతో ఏడాదంతా ఇంటి వద్దనే ఉండి పరీక్షలకు సన్నద్ధమయ్యే వీలుంది. సమాజంలో వస్తున్న మార్పును అందిపుచ్చుకోవడమే కాకుండా చదువు ప్రాముఖ్యతను గుర్తించి అమ్మాయిలు ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మనూ దూరవిద్య కేంద్రం సంచాలకులు ప్రొ.పి.ఎఫ్‌.రెహ్మాన్‌ ‘ఈనాడు’కు వివరించారు.

దరఖాస్తుల స్వీకరణ
2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రొ.రెహ్మాన్‌ తెలిపారు. అభ్యర్థులు నేరుగా ్త్మ్మ్ప(://్ఝ్చ-్య్య‘్న’.i-/్ట్ట’్న-ఃi-’్చ్ట్ఝi((i్న-19 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులకు ఆగస్టు 1లోగా రూ.200 రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించి ప్రవేశం పొందే వీలుంది. మరిన్ని వివరాలకు 040-23008463, 23120600 (ఎక్స్‌టెన్షన్‌ 2207) నంబరులో సంప్రదించవచ్చు.

మొత్తం 17 కోర్సులు
ప్రస్తుతం ఉర్దూ విశ్వవిద్యాలయంలోని దూరవిద్య ద్వారా 5 యూజీ, 6 పీజీ, మరో 6 డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నారు. బీఈడీతోపాటు ఎంఏ (ఉర్దూ, ఆంగ్లం, చరిత్ర, హిందీ, అరబిక్‌, ఇస్లామిక్‌), బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్‌సెన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌), డిప్లొమా (ఆంగ్ల బోధన, జర్నలిజం - మాస్‌ కమ్యూనికేషన్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది బీఏ చదివేందుకే ఆసక్తి చూపుతున్నారు. పీజీ కోర్సుల్లో ఎంఏ ఉర్దూ, ఆంగ్లానికి మొగ్గు చూపుతున్నారు. బీఈడీ కోర్సులకు సంబంధించి వెయ్యి సీట్లుండగా ఇప్పటికే ప్రవేశాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం వర్సిటీ తరఫున దేశవ్యాప్తంగా 9 రీజనల్‌ సెంటర్లు, 5 సబ్‌రీజనల్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 112 ఓపెన్‌ లెర్నింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి బోధన అందిస్తున్నారు. మరో 19 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యార్థుల నుంచి స్పందన, ఫ్యాకల్టీ తదితర కోణంలో ఆలోచించి వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.