close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

ఘనంగా కావడియాత్ర

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అత్తాపూర్‌ అంబియెన్స్‌పోర్టు నుంచి చిన్నఅనంతగిరి ఆలయం వరకు ఆదివారం కావడియాత్ర నిర్వహించారు. మార్వాడీసమాజ్‌ ఆధ్వర్యంలో ఏటా ఈ యాత్రను నిర్వహించారు. యాత్రలో మోసుకొచ్చిన నీటితో శివాలయంలో శివలింగానికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా మార్వాడీ సమాజ్‌ సభ్యులు అరవింద్‌ అగ్రవాల్‌ మాట్లాడుతూ.. ఏటా ఈ కావడియాత్రను నిర్వహిస్తామని అన్నారు. శివలింగానికి అభిషేకంతో మంచి జరుగుతుందని అన్నారు. యాత్రకు ఆలయకమిటీ సభ్యులు ఎస్‌.మల్లారెడి, ఎస్‌బీ హరినాథ్‌, బి.మల్లారెడ్డి, ఎస్‌.కృష్ణ తదితరులు స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.