ఆదివారం, డిసెంబర్ 08, 2019
చార్మినార్, న్యూస్‌టుడే: సాలార్జంగ్ మ్యూజియంలో బాలల దినోత్సవం సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన ‘దశరూప’ కళాఖండాల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. చిన్నారుల చిట్టి చేతులతో అద్భుతంగా మలిచిన పెయింటింగ్ కళాఖండాలు ప్రదర్శనలో ఉంచారు. ఆధ్యాత్మికతను పంచే దేవతా మూర్తులు చిత్రాలతోపాటు ప్రకృతి సౌందర్యంగా కనువిందు చేసే పుష్పాలు, వృక్షాలు, పలు రకాల పక్షుల చిత్రాలను ప్రదర్శనలో పెట్టారు. కూకట్‌పల్లిలోని ఓంసాయి ఫైన్ఆర్ట్స్ అకాడమీకి చెందిన పది మంది విద్యార్థులు గీసిన సుమారు వంద పెయింటింగ్ కళాఖండాలను దశరూప ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను అకాడమీ విద్యార్థులతో మ్యూజియం డైరక్టర్ ఎ.నాగేందర్‌రెడ్డి ప్రారంభిచారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన ఈనెల 20 వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో మ్యూజియం క్యూరేటర్లు డాక్టర్ ఘన్శ్యామ్కుసుమ్, డాక్టర్ ఆర్బీ నాయక్, డిప్యూటీ కీపర్ సీహెచ్ శ్రీనివాస్‌రావు, సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండర్ తోమర్ తదితరులు పాల్గొన్నారు.
సాలార్జంగ్ మ్యూజియంలో బాలల దినోత్సవం
బాలల దినోత్సవం సందర్భంగా గురువారం సాలార్జంగ్ మ్యూజియంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. సీనియర్ విభాగాల్లో రింకు, మణిధర్, దినేశ్, అశ్వని, మహేశ్ అనే విద్యార్థులు విజేతలుగా నిలవగా.. జూనియర్ విభాగంలో గౌతమ్‌రెడ్డి, శివసాయి గెలుపొందారు. విజేతలకు మ్యూజియం అధికారులు ప్రశంసాపత్రాలతోపాటు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మ్యూజియం కీపర్లు డాక్టర్ ఘన్శ్యామ్కుసుమ్, డాక్టర్ ఆర్.బి.నాయక్, డ్రాఫ్టుమెన్ అరుణాకుమారి, డిప్యూటీ కీపర్ సీహెచ్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కీపర్ శ్రీదేవి, గైడ్ లెక్చర్ రమణి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు