close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

తండ్రిని ఆదుకోలేకపోతున్నాననే ఆవేదనతో యువకుడు ఆత్మహత్య

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: తండ్రిని ఆర్థికంగా ఆదుకోలేక పోతున్నాననే ఆవేదనతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి ఠాణా పరిధిలోని గీతానగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఎస్సై హరీశ్‌ కథనం ప్రకారం కుత్బుల్లాపూర్‌ గాజులరామారానికి చెందిన గున్నా వంశీరెడ్డి(28) ఏడాదిన్నరగా మల్కాజిగిరిలో ఒంటరిగా ఉంటున్నాడు. ఇక్కడ ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగం సంపాదించుకుని విశ్రాంత ఉద్యోగి అయిన తండ్రి వెంకటరెడ్డిని ఆదుకోవాలనేది అతని ఆశయం. ఇటీవల వంశీరెడ్డికి బేగంపేటకు చెందిన ఓ యువతితో తండ్రి పెళ్లి ఖాయం చేశారు. ఇలాంటి సమయంలో ఆ యువతితో కలిసి వంశీ గురువారం రాత్రి సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తున్నంతసేపు ముభావంగా ఉన్నాడు. తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. శుక్రవారం తెల్లవారు జామున మూడున్నర ప్రాంతంలో ఆ యువతికి ‘తనకు ఉండాలని లేదని, చచ్చిపోవాలని ఉందని’ సందేశాన్ని పంపాడు. ఆమె దానిని తెల్లవారిన తర్వాత చూసుకుంది. వెంటనే ఆమె వంశీ తండ్రికి ఈ సందేశాన్ని పంపింది. సమాచారం అందుకున్న తండ్రి వెంటనే కుమారుడు ఉండే ఇంటికి వచ్చారు. లోపలికి వెళ్లి చూడగా కుమారుడు ఉరి వేసుకుని కనిపించాడు. ఈ సంఘటనపై వెంకటరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.