
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 9 AM
1. ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సుమారు 2,44,71,002 మంది గ్రామీణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. 30న మినీ పురపోరు!
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పురపాలక, నగరపాలక ఎన్నికలకు ఈ నెలలోనే నగారా మోగనుంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితాలకంటే ముందే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా ఐదు పురపాలక సంఘాలకు ఎన్నికలు పూర్తికానున్నాయి. ఈనెల 17న సాగర్ ఎన్నిక జరగనుంది. అంతకంటే ముందే ప్రకటన విడుదల చేసి ఈనెల 30న పుర ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. సాగర్ ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈలోపే పుర ఎన్నికలు పూర్తికానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఆంధ్రప్రదేశ్‌కు ఆప్మెల్... తెలంగాణకు సింగరేణి
సింగరేణి కాలరీస్ సంస్థ తెలంగాణకు, దాని అనుబంధ సంస్థ ఆప్మెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందాలని అటార్నీ జనరల్ న్యాయసలహా ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యలపై బుధవారం దిల్లీ నుంచి రెండు రాష్ట్రాల అధికారులతో అజయ్ భల్లా దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పరీక్షలే జీవిత పరమార్థం కాదు
పరీక్షలే జీవిత పరమార్థం కాదనీ, సుదీర్ఘ ప్రయాణంలో అవి చిన్న గమ్యాలు మాత్రమేనని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’ పేరుతో బుధవారం ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడారు. కష్టంగా అనిపించే పాఠ్యాంశాలను వదిలిపెట్టేయకుండా ఉదయాన్నే వాటిని చదవాలని, కాస్త సులభంగా అనిపించేవాటిని రాత్రిపూటైనా చూసుకోవచ్చని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఆ తప్పిదంతోనే మూల్యం?
ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ బలగాలకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆపరేషన్‌లో ఎక్కడ తప్పిదం జరిగింది? ఈ దిశగా పోలీసు శాఖలో అంతర్గత విశ్లేషణ సాగుతోంది. సీఆర్పీఎఫ్ జవాన్ల బృందం గంటలకొద్దీ ఒకే ప్రాంతంలో వేచి ఉండటంతోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. వసూళ్లపర్వంలో మరో ఇద్దరు మంత్రులు
ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం, దాని యజమాని మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో అరెస్టై ఎన్ఐఏ కస్టడీలో ఉన్న పోలీస్ అధికారి సచిన్ వాజే మరో బాంబు పేల్చాడు. ఇప్పటికే నెలకు రూ.100 కోట్లు వసూలు వ్యవహారంపై వాజే.. ఎన్ఐఏకు రాసిన 4 పేజీల లేఖ కలకలం రేపుతోంది. లేఖలో అనిల్‌పై పరమ్‌బీర్ చేసిన ఆరోపణలు నిజమేనని వాజే ధ్రువీకరించాడు. ఇంకో ఇద్దరు మంత్రులు ప్రమేయంపైనా సంచలన విషయాలు బయటపెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఫిల్మ్ ట్రైబ్యునల్ రద్దు.. అత్యవసర ఆదేశాలు
ఫిల్మ్ సర్టిఫికేషన్ అపిలేట్ ట్రైబ్యునల్ (ఎఫ్ఏసీటీ) సహా మరికొన్ని ట్రైబ్యునళ్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ట్రైబ్యునళ్ల సంస్కరణల (హేతుబద్ధీకరణ, సర్వీసు నిబంధనలు) ఆర్డినెన్స్-2021 పేరుతో దీన్ని అధికారికంగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) నుంచి సినిమాలకు ధ్రువపత్రాలు పొందడంలో సమస్యలు ఉంటే నిర్మాతలు ఇంతవరకు ఈ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేవారు. ఇకపై వారు హైకోర్టులో అపీలు చేయాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. టీకాతోనే 100% రక్షణ
కొవిడ్ మహమ్మారి నుంచి 100 శాతం రక్షణ టీకాతోనే సాధ్యమవుతుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను అందజేస్తే.. మూడోదశ కొవిడ్ ఉద్ధృతి ఉండదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ కూడా సమర్థమైనవేననీ, ఏ టీకా తీసుకున్నా పనితీరులో లోపం ఉండదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. దారితప్పుతున్న బంధం
ఎదిరించి నిలబడలేనన్న నిస్పృహ, బాధ్యత మరిచిపోతున్న కుటుంబ నేపథ్యాలే పలువురు బాధితురాళ్ల నరకానికి కారణమవుతున్నాయి. మరికొన్ని సంఘటనల్లో మాత్రం కుటుంబ పరువు అనేది నోరు నొక్కేలా చేస్తోంది. బాధను భరించలేక, బెదిరింపుల ‘బంధం’ నుంచి తప్పిచుకోలేక పోతున్న వారిలో 12 నుంచి 18 ఏళ్ల లోపు (మైనర్) బాలికలే అధికంగా ఉంటున్నారని గత సంఘటనలను విశ్లేషిస్తే తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. త్రీడీలో క్యాచ్‌ల వీక్షణం
క్యాచ్‌ను త్రీడీ కోణంలో చూస్తే ఎలా ఉంటుందో ఈసారి ఐపీఎల్లో చూడబోతున్నామంటున్నాడు స్టార్-డిస్నీ హెడ్ (స్పోర్ట్స్) సంజోగ్ గుప్తా. ఈసారి ఐపీఎల్‌ను అత్యున్నత సాంకేతికత పరిజ్ఞానంతో అభిమానులకు అందిస్తామని అతను చెప్తున్నాడు. క్రికెట్ ప్రసారంలో గతంలో ఎన్నడూ చూడని వినూత్నమైన విశేషాలకు ఐపీఎల్ వేదికగా నిలుస్తుందని సంజోగ్ ‘ఈనాడు’తో వివరించారు. ‘‘క్రికెట్ వీక్షణ విషయంలో ఈసారి ఐపీఎల్ ప్రత్యేకంగా ఉండబోతుంది. వికెట్ల మధ్య పరుగును కొలిచే ‘ఆప్టికల్ ట్రాకింగ్ టెక్నాలజీ’ని ఉపయోగిస్తున్నాం’’అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి