KTR: అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 17/08/2021 17:03 IST

KTR: అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలోని దళితులు ఆర్థిక సుస్థిరత సాధించడమే దళితబంధు ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.  సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న గీతమ్‌ డీమ్డ్‌ వర్సిటీలో పబ్లిక్ పాలసీ విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో కేటీఆర్‌ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. దళితులకు ఇచ్చే రూ.10 లక్షలను ఎలా ఖర్చు చేస్తున్నారు.. ఎందుకు ఖర్చు చేస్తున్నారనేది అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారన్నారు. ఆ రూ.10 లక్షల మొత్తంతో వ్యాపారాలు ప్రారంభించడానికి, వాటిని పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించేందుకు ఉపయోగపడేలా అధికారులు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం ప్రారంభం తర్వాత మైనారిటీ బంధు, బీసీ బంధు లాంటి డిమాండ్లు వస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా ఏ గణాంకాలు చూసినా దళితులు అట్టడుగున ఉంటున్నారని.. వారు సాధికారత సాధించేలా ముందుగా వారికి ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు.

‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద 62 లక్షల మంది రైతులకు రూ.15 వేల కోట్లు ఇస్తున్నాం. రైతు బంధు వచ్చాక రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయి. ఇప్పుడు దేశంలోని 11 రాష్ట్రాలు రైతు బంధును అమలు చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రమే ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఉంది. విభజన వల్ల రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్లు ఏమయ్యాయో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పటివరకూ 1.39 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. నాన్న నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు. నాన్నకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చాను’’ అని కేటీఆర్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని