ప్రధానాంశాలు

Published : 18/06/2021 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Corona: టీకాలతో 94 శాతం రక్షణ

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌ నుంచి కరోనా టీకాలు 94 శాతం రక్షణ కల్పిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆక్సిజన్ అందించాల్సిన అవసరాన్ని 8 శాతానికి, ఐసీయూలో చికిత్స తీసుకునే పరిస్థితిని 6 శాతానికి తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. అయితే టీకాలు తీసుకున్నప్పటికీ నిబంధనల విషయంలో అజాగ్రత్త వద్దని హెచ్చరించింది. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో దేశంలోని కొవిడ్ పరిస్థితిని వివరించింది. అలాగే వైద్యులపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించింది.

96శాతానికి రికవరీ రేటు..మే 3 నుంచి దేశంలో రికవరీ రేటు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు 96 శాతానికి చేరింది. గురువారం 88,977 మంది కోలుకోగా, మొత్తం రికవరీలు 2.85 కోట్ల మార్కును దాటాయి. క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 8లక్షల దిగువకు చేరాయి. 

కొత్త కేసుల్లో 85 శాతం తగ్గుదల..దేశంలో మే 7న గరిష్ఠ స్థాయిలో నాలుగు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆ రోజు నుంచి ఇప్పటివరకు 85 శాతం క్షీణత కనిపించింది. జూన్ 11 నుంచి 17 మధ్యలో 513 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం దిగువనే ఉంది. ఏప్రిల్ 30 నుంచి మే 6 మధ్యలో పాజిటివిటీ రేటు 21.6 శాతంగా నమోదైంది. ఇప్పుడు ఆ వారపు సగటు పాజిటివిటీ రేటులో 81 శాతం తగ్గుదల కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలకు సడలింపులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. 

2.58కోట్ల డోసులు రాష్ట్రాల వద్దే.. 2.58 కోట్ల టీకా డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో మూడు రోజుల్లో 19.95లక్షల టీకాలు రాష్ట్రాలకు అందనున్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 27.9 కోట్ల డోసులను అందజేసినట్లు పేర్కొంది. అలాగే గురువారం 32,59,003 మంది టీకాలు వేయించుకున్నారు. మొత్తంగా 26.89కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు చెప్పింది. 

మరోపక్క కొవిడ్ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దాడి చేసిన వారిపై నాన్‌బెయిలబుల్ నేరం కింద కేసు నమోదవుతుందని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. దీనికి సంబంధించి కేంద్రం ఇప్పటికే ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన విషయాన్ని పునరుద్ఘాటించింది. 

 

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net