
తాజా వార్తలు
‘నారప్ప’ పెద్ద కుమారుడు ఇతనే!
హైదరాబాద్: వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. ప్రియమణి కథానాయిక. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ధనుష్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో ‘నారప్ప’ సినిమా షూటింగ్‌ను కొంతకాలంపాటు వాయిదా వేశారు.
ఇప్పటికే మాస్‌లుక్‌లో ఉన్న వెంకటేశ్ స్టిల్‌ను విడుదల చేయగా, ఇటీవల ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా ఆమె లుక్‌ను కూడా విడుదల చేశారు. వెంకటేశ్ ఇందులో ఇద్దరు కొడుకుల తండ్రి కనిపించనున్నారు. పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్ రత్నం కనిపించనున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’లో కార్తీక్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కార్తీక్ మునికన్నాగా అలరించనున్నాడు.
‘‘సురేశ్ ప్రొడక్షన్స్ చరిత్రలోనే సుదీర్ఘమైన చిత్రీకరణ షెడ్యూల్ ‘నారప్ప’. ‘కొవిడ్-19’ పరిస్థితుల దృష్ట్యా ‘నారప్ప’ సినిమానికు కొంతకాలంపాటు బ్రేక్ ఇస్తున్నాం. బయట పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ షూట్‌ను తిరిగి ప్రారంభిస్తాం. వీలైనంత వరకూ జన సమూహాలకు దూరంగా ఉండాలని కోరుతున్నాం. ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉండండి’’ అని సురేశ్ ప్రొడక్షన్స్ ఇటీవల పేర్కొంది.