మార్కెట్‌ కబుర్లు
close

తాజా వార్తలు

Published : 04/04/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్‌ కబుర్లు

* ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో బాండ్లు జారీ చేయడం ద్వారా వచ్చే వారం రూ.7,500 కోట్ల వరకు నిధులు సమీకరించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది.
* నష్టాల్లో ఉన్న కొరియన్‌ అనుబంధ సంస్థ శాంగ్‌ యాంగ్‌ మోటార్‌ కంపెనీలోకి (ఎస్‌వైఎమ్‌సీ) కొత్తగా ఈక్విటీని చొప్పించే ప్రతిపాదనను మహీంద్రా అండ్‌ మహీంద్రా బోర్డు తిరస్కరించింది.
* గత నెలలో అమెరికాలో ఉద్యోగాలు 7,01,000 తగ్గిపోయాయని కార్మిక శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. నిరుద్యోగిత రేటు 4.4 శాతానికి పెరిగింది. మార్చి నెల చివరి రెండు వారాల్లో సుమారు కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలుస్తోంది.
* దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ మారికో తమ ఉత్పత్తుల్ని వినియోగదారులకు చేరవేసేందుకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలతో ఒప్పందం కుదుర్చుకుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని