నాలుగో టెస్టుకు బుమ్రా దూరం..
close

తాజా వార్తలు

Published : 27/02/2021 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం..

ఇంటర్నెట్‌డెస్క్‌: అహ్మదాబాద్‌ వేదికగా వచ్చేవారం నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే నాలుగో టెస్టుకు టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పూర్తిగా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల రీత్యా జట్టు నుంచి విశ్రాంతి కావాలని కోరడంతో బీసీసీఐ శనివారం ఆమోదం తెలిపింది. అతడి స్థానంలో కొత్తగా ఎవరినీ జట్టులోకి తీసుకోవడం లేదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఇక చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో మొత్తం 4 వికెట్లు తీసిన బుమ్రాకు.. టీమ్‌ఇండియా తర్వాతి మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చింది. తాజాగా అతడి కోరిక మేరకు నాలుగో టెస్టుకు పూర్తిగా పక్కనపెట్టినట్లు బీసీసీఐ వివరించింది. మరోవైపు మూడో టెస్టులో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా 2-1 తేడాతో సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది. కోహ్లీ టీమ్‌ చివరి టెస్టు గెలిచినా, డ్రా చేసుకున్నా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కివీస్‌తో తలపడే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని