
తాజా వార్తలు
మేముంటే లక్షా 20 వేలు ఇచ్చేవాళ్లం: చంద్రబాబు
హైదరాబాద్: రైతుభరోసా కొత్త పథకం కాదు... అన్నదాత సుఖీభవను రద్దు చేసి రైతుభరోసా తెచ్చారు అని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుభరోసా పథకం, రైతు దినోత్సవంపై చంద్రబాబు మాట్లాడారు. రుణమాఫీ రూ.ఏడు వేలు ఎగ్గొట్టడమే రైతు దినోత్సవమా అని చంద్రబాబు ప్రశ్నించారు.
‘‘రైతుభరోసాతో ఐదేళ్లలో రైతుకు ప్రస్తుతం వచ్చేది రూ. 37,500 మాత్రమే. మా ప్రభుత్వం ఉంటే ఒక్కో రైతుకు రూ. లక్షా 20 వేలు వచ్చేవి. బడ్జెట్లో చెప్పిన సంఖ్యలోనే పది లక్షలమందికి రైతు భరోసా ఎగ్గొట్టారు. 34 వేల ఎకరాలు ఇచ్చినవారి ప్రాణాలు తీయడమే రైతు దినోత్సవమా’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
Tags :