కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన రణధీర్‌ కపూర్‌
close

తాజా వార్తలు

Updated : 30/04/2021 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన రణధీర్‌ కపూర్‌

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, కరీనా కపూర్‌ తండ్రి రణధీర్‌ కపూర్‌కి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. 74 ఏళ్ల రణధీర్‌ కపూర్‌ శ్వాసకోస సమస్యతో బుధవారం రాత్రి ముంబయిలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కొవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే, కుటుంబ సభ్యులు ఎవరు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన ఆగోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన్ను మరిన్ని ఆరోగ్య పరీక్షల కోసం ఐసీయుకి తరలించారు. దేశంలో కరోనా రెండో దశ చాలా ఉధృతంగా పెరుగుతోంది. దాంతో రోజురోజుకి పెద్దమొత్తంలో కొవిడ్‌ కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలామందికి కొవిడ్‌ సొకింది. వారిలో కత్రీనా కైఫ్‌, అక్షయ్‌ కుమార్‌, అలియా భట్‌, రణబీర్‌ కపూర్ నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ఉన్నారు. రణధీర్ కపూర్‌ ఈ మధ్యకాలంలో తన సోదరులైన రిషి కపూర్‌, రాజీవ్ కపూర్లను కోల్పోయారు. వారిలో రిషి కపూర్‌ క్యాన్సర్‌ వ్యాధితో రెండేళ్ల  సుదీర్ఘ పోరాటం సాగించి గత ఏడాది మృతిచెందారు. ఇక మరో సోదరుడు రాజీవ్ కపూర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించారు. ఈ రోజుకి (ఏప్రిల్ 30) రిషి కపూర్ మరణించి ఏడాది అవుతోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని